లెక్చరర్స్‌కు ‘పరీక్ష’
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోని జూనియర్ లెక్చరర్స్(జేఎల్స్)కు ఐదేండ్లకోసారి పరీక్ష పెట్టాలని తెలంగాణ విద్యా కమిషన్ సర్కార్‌కు సూచించింది. ప్రతి లెక్చరర్ ఈ పరీక్ష రాసి, అర్హత సాధించాల్సిందేనని ప్రతిపాదించింది. టీజీపీఎస్సీ లేదా మరో ఏజెన్సీ చేత పరీక్ష నిర్వహించాలని సర్కార్‌కు సమర్పించిన నివేదికలో కమిషన్ పేర్కొన్నది.
- ప్రతి ఐదేండ్లకు జేఎల్స్‌కు పరీక్ష
- సర్కార్‌కు విద్యాకమిషన్ సూచన
- కొత్త లెక్చరర్స్‌కు టెట్ పరీక్ష మస్ట్
- డిగ్రీ, పీజీ, బీఈడీలో 60% తప్పనిసరి
హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోని జూనియర్ లెక్చరర్స్(జేఎల్స్)కు ఐదేండ్లకోసారి పరీక్ష పెట్టాలని తెలంగాణ విద్యా కమిషన్ సర్కార్‌కు సూచించింది. ప్రతి లెక్చరర్ ఈ పరీక్ష రాసి, అర్హత సాధించాల్సిందేనని ప్రతిపాదించింది. టీజీపీఎస్సీ లేదా మరో ఏజెన్సీ చేత పరీక్ష నిర్వహించాలని సర్కార్‌కు సమర్పించిన నివేదికలో కమిషన్ పేర్కొన్నది. ఇది కేవలం ప్రభుత్వ, ప్రభుత్వరంగ కాలేజీల్లో పనిచేస్తున్న వారికి మాత్రమేనని తెలిపింది. ఈ పరీక్ష పాస్‌కాకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తారన్న భయాలు లెక్చరర్లను పట్టిపీడిస్తున్నాయి.
భవిష్యత్తుల్లో నియమించే జేఎల్స్‌కు కొత్త అర్హతలుండాలని సూచించింది. ఇంగ్లిష్ మీడియంలో పీజీ చదివిన వారిని మాత్రమే జేఎల్స్‌గా తీసుకోవాలన్నది. అంతేకాకుండా బీఈడీ చదివి ఉండాలని, బీఈడీ, డిగ్రీ, పీజీలో 60% మార్కులు మస్ట్‌గా ఉండాలని పేర్కొన్నది. సీటెట్ లేదా తెలంగాణ టెట్లలో ఏదో ఒకదాంట్లో పాసై ఉండాలని, పాఠశాల, ఇంటర్లో ఏదో ఒక స్థాయిలో ఇంగ్లిష్ మీడియంలో చదివిన వారే అర్హులుగా ఉండాలని ప్రతిపాదించింది.
పాఠశాల విద్యలో ఇంటర్ విలీనం
ఇంటర్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేయాలని విద్యాకమిషన్ సూచించింది. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ మాడల్‌ను ప్రవేశపెట్టడంతో ఇంటర్‌విద్య ప్రత్యేకంగా అవసరంలేదని సూచించింది. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌లో ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు విద్యను అందిస్తుండటంతో ఇంటర్ విద్యను విలీనం చేయాలని ప్రతిపాదించింది. ఎస్సెస్సీ, ఇంటర్బోర్డులను విలీనం చేసి ఒకే గొడుగు కిందికి తీసుకురావాలని, ఈ స్వతంత్ర బోర్డు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి నియంత్రణలో ఉండాలని పేర్కొన్నది.
మరికొన్ని సిఫార్సులు
- బోధనేతర సిబ్బందికి జేఎల్స్‌గా ఉద్యోగోన్నతి కల్పించొద్దు. రెగ్యులర్ లేదా కారుణ్య నియామకాల ద్వారా నియమితులైన వారికి జేఎల్స్‌గా ప్రమోషన్లు ఇవ్వొద్దు.
- రెండు కిలోమీటర్లకో కాలేజీ మాత్రమే ఉం డాలి. అంతకంటే ఎక్కువవుంటే చిన్న కాలేజీలను పెద్ద కాలేజీల్లో విలీనంచేయాలి. ఒకే మండలంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ, గురుకులం, మాడల్ స్కూల్స్ ఉంటున్నాయి. మూడు సంస్థల్లోని విద్యార్థులు, లెక్చరర్లు, బోధనేతర సిబ్బందిని ఒకే పరిపాలన కిందికి తీసుకురావాలి.
- ఇంటర్ పరీక్షల్లో మార్పులు చేయాలి. విద్యార్థులకు 50% వ్యాసప్రశ్నలు(డిస్క్రిప్టివ్), మరో 50% బహుళైచ్చిక(మల్టీపుల్ చాయిస్) ప్రశ్నలు ఇవ్వాలి.
- నిరుడు అడిగిన ప్రశ్నలు మళ్లీ ఇవ్వొద్దు. ఉత్తీర్ణత మార్కులను 35నుంచి 40శాతానికి పెంచాలి.
- ఇంటర్ విద్యార్థుల జవాబుపత్రాలను ఇద్దరి చేత మూల్యాంకనం చేయించాలి. 19% వ్యత్యాసముంటే మూడో వ్యక్తి చేత మూల్యాంకనం చేయించాలి.
- బోధనేతర, పరిపాలనా నేపథ్యం గల సి బ్బందిగా నియమితులై లెక్చరర్లు, ప్రిన్సిపాళ్లుగా కొనసాగుతున్న వారిని తొలగించాలి.
- వొకేషనల్ కోర్సులను ఇంటర్ విద్య నుంచి తొలగించాలి. ఐటీఐలు, పాలిటెక్నిక్ కాలేజీలకు మార్చాలి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

