బెల్లంపల్లి, నవంబర్ 1 : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో రోడ్డు వెడల్పు పనులు రెండో రోజు ఉద్రిక్తతల నడుమ కొనసాగాయి. సింగరేణి ఏరియా దవాఖాన నుంచి కాంటా చౌరస్తా వరకు రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా అక్రమ నిర్మాణాల తొలగింపు పనులు శుక్రవారం మొదలయ్యాయి. శనివారం కాంటా చౌరస్తా వద్ద ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనం ముందు తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న చికెన్, కోళ్ల దుకాణాలతో పాటు షెడ్లు, ఇతర నిర్మాణాలను జేసీబీతో తొలగించడానికి ము న్సిపల్ సిబ్బంది రాగా చిరువ్యాపారులు అడ్డుకున్నారు.
రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పలువురు వ్యాపారులు ఒంటిపై పెట్రోలు పోసుకునేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకుని స్టేషన్కు తరలించారు.