హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల ఎన్నికలకు నేడు (గురువారం) నోటిఫికేషన్ విడుదల చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తున్న నేపథ్యంలో ఉత్కంఠ కొనసాగుతున్నది. నోటిఫికేషన్ ఇస్తారా.. ఇవ్వరా అనే సందేహాలు కూడా రాజకీయవర్గాల్లో కొనసాగుతున్నాయి. 42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశం హైకోర్టులో పరిధిలో ఉన్నది.
ఈ పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్లు జారీ చేయవచ్చా? చేస్తే ఎలాంటి పర్యవసానాలు ఉంటాయనే కోణంలో రాష్ట్ర ఎన్నికల రాణి కుముదిని న్యాయ నిపుణులతో చర్చించినట్టు సమాచారం. నోటిపికేషన్ జారీ చేసిన తర్వాత తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై సలహాలు తీసుకున్నట్టు తెలిసింది.