Vaikunta Ekadashi | వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచే భక్తులు వైష్ణవ ఆలయాలకు తరలివెళ్లి.. ఉత్తర ద్వార దర్శనాలు చేసుకుంటున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో తెల్లవారుజామునే ఉత్తర ద్వారాన్ని తెరిచారు. దీంతో భక్తులు పెద్ద ఎత్తున శ్రీవారిని దర్శించుకుంటున్నారు. వేములవాడలో రాజన్న ఆలయానికి అనుబంధంగా ఉన్న భీమన్న గుడిలో ఉత్తర ద్వార దర్శనాలు నిర్వహించారు..

Vemulawada
తెలంగాణలో యాదగిరిగుట్టలో ఉదయం 5.40 నిమిషాల నుంచి ఉత్తర గోపురం ద్వారా లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి అనుమతిస్తున్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలోనూ ఘనంగా వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమైంది. గరుడ వాహనంపై శ్రీరామచంద్రస్వామి, గజవాహనంపై సీతమ్మ, హనుమత్ వాహనంపై లక్ష్మణుడు దర్శనమిచ్చారు.

Dharmapuri1
వైకుంఠ ఏకాదశి సందర్భంగా ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కొండగట్టు శ్రీఆంజనేయస్వామి దేవస్థానంలో తెల్లవారుజాము నుంచే ఉత్తర ద్వార దర్శనానికి అనుమతిస్తుండటంతో భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. కామారెడ్డి జిల్లాలో శ్రీ వేంకటేశ్వర స్వామి, వేణుగోపాల స్వామి ఆలయంలోనూ వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు క్యూ కట్టారు.

Yadagirigutta1

Dharmapuri2

Dharmapuri3

Kamareddy1

Kamareddy2

Kondagattu

Kondagattu1

Yadagirigutta1