హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశమున్నదని వాతావరణ శాఖ పేర్కొంది.
ఎల్నినో పరిస్థితుల కారణంగా మార్చి-జూన్ మధ్య పలు రాష్ర్టాల్లో మునుపెన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయని, తీవ్ర వడగాల్పులు వీస్తాయని అధికారులు వెల్లడించారు.