హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తేతెలంగాణ): రాష్ట్రంలో ఎండలు క్రమంగా పెరుగుతున్నాయి. గత నెలలో ఉత్తర దిశ నుంచి వీచిన గాలుల దిశ మారడంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. చలి తీవ్రత తగ్గి ఎండలు పెరుగుతున్నాయి.
కొన్ని జిల్లాల్లో పగటిపూట 34 నుంచి 37 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రివేళ 12 నుంచి 22 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉంటున్నది. మరోవైపు ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో విద్యుత్తు డిమాండ్ కూడా పెరుగుతున్నది.