హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ) : ఇంటర్లో తెలుగును ఆప్షనల్‌గా కాకుండా, తప్పనిసరిగా బోధించాలని జాతీయ తెలుగు పరిరక్షణ సమితి ప్రభుత్వాన్ని కోరింది. తెలుగుభాషకు పూర్వవైభవం తేవాలని, ఈ విద్యాసంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 5వ తరగతి వరకు తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని సమితి అధ్యక్షుడు రాఘవ మాస్టారు కేదారి మంగళవారం ప్రభుత్వానికి వినతిపత్రం అందజేశారు. పరిపాలన, ప్రభుత్వ ఉత్తర్వులు, కార్యాలయాల్లో ఇంగ్లిష్‌తోపాటు తెలుగులో నివేదికలు, సమాచారం ఉండేట్టు చూడాలని కోరారు.