KCR | హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ పాలనా దక్షతకు మరో గుర్తింపు దక్కింది. బీఆర్ఎస్ హయాంలో పల్లెప్రగతికి ఇచ్చిన ప్రాధాన్యానికి అరుదైన గౌరవం లభించింది. తెలంగాణ పల్లెలకు ఉత్తమ ఘనత దక్కింది. ‘పంచాయతీ పురోగతి’ సూచికలో దేశంలోనే రాష్ట్రం అ‘ద్వితీయం’గా నిలిచింది. దేశంలోని గ్రామ పంచాయతీలు 2022-23 నాటికి సాధించిన పురోగతి ఆధారంగా కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ మంగళవారం పంచాయతీ పురోగతి సూచిక (పీఏఐ)ను విడుదల చేసింది. ఇందులో తెలంగాణ రాష్ట్రం రెండో స్థానం కైవసం చేసుకున్నది. దేశవ్యాప్తంగా 699 పంచాయతీలు టాప్‌లో నిలువగా, ఇందులో గుజరాత్, తెలంగాణ నుంచే అధిక గ్రామాలు ఉన్నాయి.
అ‘ద్వితీయం’..కేసీఆర్ పథకాలు
తొమ్మిది అంశాల ఆధారంగా కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ‘పంచాయతీ పురోగతి’ సూచికను ప్రకటించింది. వాటిలో పేదరిక నిర్మూలన, పంచాయతీల్లో జీవనోపాధి పెంపు, ఆరోగ్యం, చైల్డ్‌ఫ్రెండ్లీ, తాగునీరు, పారిశుధ్యం, పచ్చదనం, మౌలిక వసతుల్లో స్వావలంబన, సామాజిక భద్రత, సుపరిపాలన, మహిళలకు అనుకూలమైన విధానాలు ఉన్నాయి. వీటికి నాటి కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట వేసింది. పేదరిక నిర్మూలన, పంచాయతీల్లో జీవనోపాధి పెంపునకు కేసీఆర్ సర్కారు అధిక నిధులు కేటాయించింది. రూ.200 పింఛన్‌ను రూ.2,016కు పెంచారు. షరతులు, బ్యాం కు లింకేజీ లేకుండా దళితబంధు కింద ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షలు అందజేశారు. రైతులకు పెట్టుబడి సా యంగా రైతుబంధు ఇచ్చారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఉండేవారికి, కులవృత్తులవారికి ఇతోధికంగా ప్రోత్సాహకాలు అందజేశారు. ప్రభుత్వం పంచాయతీలకు ట్రాక్టర్లు అందించింది. డంపింగ్‌యార్డుల ద్వారా ఎరువుల ఉత్పత్తికి ఊతమిచ్చింది.
గ్రామాల్లో ఆరోగ్యం, తాగునీరు
కేసీఆర్ తలపెట్టిన పల్లెప్రగతి కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలిచింది. గ్రామాల్లో ఎక్క డా చెత్త పేరుకుపోకుండా వెంటవెంటనే ఎత్తివేయడానికి ట్రాక్టర్‌ను అందించింది. డంపింగ్ యార్డులను ఏర్పాటుచేసింది. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించింది. ఫలితంగా అనేక వ్యాధులు దూరమయ్యాయి. జిల్లా లు, మండలాల ఏర్పాటుతో వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, అమ్మ ఒడి పథకాలు మహిళలకు వరంగా మారాయి. గ్రామాల్లో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుతోచిన్నారులకు అనుకూలమైన సౌకర్యాల కల్పన జరిగింది.
పారిశుధ్యం, పచ్చదనం, భద్రత..
కేసీఆర్ పాలనలో పల్లెలు పారిశుధ్యం, పచ్చదనంతో పరిఢవిల్లాయి. కేసీఆర్ ప్రభు త్వం ప్రతీ గ్రామానికి కేటాయించిన ట్రాక్ట ర్ పారిశుధ్యరంగంలో కొత్త చరిత్రను లి ఖించింది. మౌలిక వసతుల కల్పన, పారిశుధ్య సిబ్బందికి వేతనాలు ఠంఛన్‌గా అందాయి. కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన తెలంగాణకు హరితహారంతో పచ్చద నం వెల్లివిరిసింది. ఊరూరా మౌలిక వసతులు సమకూరాయి. తొమ్మిది అంశాల ఆధారంగా ఈ ర్యాం క్లు కేటాయించగా.. గుజరాత్‌లోని 346, తెలంగాణలో 270 పంచాయతీలు ఏ గ్రేడ్ దకించుకుని తొలి రెండు స్థానాల్లో నిలిచాయి.