హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): ఉగాది(ఈ నెల 30) నుంచి రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తామని సివిల్ సప్లయ్‌శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం దక్కన్ ఫ్యాక్టరీ గెస్ట్‌హౌస్‌లో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పీడీఎస్ ద్వారా సన్నబియ్యం పంపిణీకి నిర్ణయించినట్టు తెలిపారు. ఈ మేరకు జిల్లాల్లో అన్ని ఏర్పాట్లుచేయాలని కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు.
మెట్పల్ల్లి, మార్చి 23 : సమస్యల పరిష్కారం కోసం రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో నేడు అసెంబ్లీ ముట్టడికి రైతులు తరలివెళ్లనున్నారు. పసుపునకు క్వింటాల్‌కు రూ.15 వేలు మద్దతు ధర, రైతు రుణమాఫీ, రైతు భరోసా సాధించడమే లక్ష్యంగా రైతులు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలి వెళ్లనున్నారు. కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు ప్రభుత్వం పోలీస్ యంత్రాంగాన్ని ఆదేశించినట్టు సమాచారం.