హైదరాబాద్, డిసెంబర్ (నమస్తే తెలంగాణ): సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి కొత్త విగ్రహావిష్కరణకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. సోమవారం సాయంత్రం 6.05 గంటలకు సీఎం రేవంత్రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని సీఎస్ శాంతి కుమారి వెల్లడించారు. ఈ మేరకు శనివారం సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
లక్ష మంది మహిళల సమక్షంలో విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్టు ప్రకటించారు. విజయోత్సవాల్లో భాగంగా నేడు నిర్వహించే ఎయిర్ షో, సంగీత విభావరికి ప్రజలు భారీగా హాజరయ్యే అవకాశముందని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను సూచించారు. శనివారం సచివాలయంలో ఎయిర్ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అజయ్ దశరథి ఎయిర్ షో జ్ఞాపికను సీఎస్ శాంతికుమారికి అందజేశారు.