హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): దేశంలో ఎకడా లేనివిధంగా గ్రామీణ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం గణనీయంగా పెంచిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. వారి గౌరవాన్ని కాపాడేందుకు నిధులు, అధికారాల కల్పనకు కట్టుబడి ఉన్నదని వెల్లడించారు. గురువారం హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో మండల ప్రజాపరిషత్ ప్రాదేశిక సంఘం సభ్యులు మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎంపీటీసీలు, జడ్పీటీసీల సమస్యలు, అధికారా లు, నిధుల కేటాయింపు తదితర సమస్యల ను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిషరిస్తామని హామీనిచ్చారు. జిల్లా, మండల పరిషత్తుల బలోపేతానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లా పరిషత్తులకు రూ.258 కోట్లు, మండల పరిషత్తులకు రూ.242 కోట్ల నిధులను కేటాయించామని తెలిపారు. ప్రతి గ్రామపంచాయతీకి రూ.5 లక్షలకు తగ్గకుండా నిధులు ఇస్తున్నామని చెప్పారు. రాజకీయ దురుద్దేశంతో ఎంపీటీసీలు, జడ్పీపీటీసీల అధికారాలు, బాధ్యతలు, నిధుల కేటాయింపుపై కాంగ్రెస్, బీజేపీ రాద్ధాంతం చేస్తున్నాయని ఆరోపించారు. తమ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినందుకు మంత్రికి సంఘ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిని కలిసినవారిలో రాష్ట్ర ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు గడల కుమార్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి అందె యాకయ్య, వరింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్, వైస్ ప్రెసిడెంట్ పల్లె వెంకన్న, రాష్ట్ర బాధ్యులు, జిల్లాస్థాయి సంఘ బాధ్యులు ఉన్నారు.