మహబూబ్‌నగర్ అర్బన్, ఫిబ్రవరి 4 : మరో రెండేండ్లల్లో కేసీఆర్ సీఎం అవడం ఖా యం అని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నా రు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పాలకొండ, హౌసింగ్‌బోర్డు, దివిటిపల్లి, ఎదిర, అప్పన్నపల్లి, ఏనుగొండ డివిజన్లో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మీ ఓటుతో మేయర్ స్థానాన్ని బీఆర్ఎస్కు అందిస్తే కార్పొరేషన్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధ్ది చేస్తామని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో పుర ఎన్నికల పరిశీలకుడు అలీ మస్క తి, మైనారిటీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్, గ్రంథాలయాల సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, డీసీసీబీ వైస్ చైర్మన్ వెంకటయ్య పాల్గొన్నారు.
మాజీ మంత్రి శ్రీనన్న భావోద్వేగం
పాలమూరు కార్పొరేషన్ ఎన్నికల ప్రచారానికి వెళ్తూ రామయ్య బౌళి సమీపంలో మినీ ట్యాంక్‌బండ్ వద్ద నిలిచిపోయిన పనులను చూసి మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ భావోద్వేగానికి గురయ్యారు. ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూ కోసం ఆయన ట్యాంక్‌బండ్ పరిసరాలను పరిశీలిస్తూ యాంకర్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. సస్పెన్షన్ బ్రిడ్జిపైకి చేరుకొని హైదరాబాద్ తరహాలో ట్యాంక్‌బండ్‌ను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో రూ.కోట్లు ఖర్చుపెట్టి స్థానికులకు ఆహ్లాదకర వాతావరణం అందించాలని నిర్మించామని తెలిపారు. అయితే కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి రెండేం డ్లు అయినా అడుగు కూడా ముందుకు వేయలేదని ఆరోపించారు. పట్నం పోకుండా పాలమూరులోని అభివృద్ధి చేసి చూపించినా.. ఈ పనులను పడావు పెట్టారనే ఆవేదనతో కన్నీటి పర్యంతమయ్యారు. అక్కడే ఉన్న బీఆర్ఎస్ నేతలు సైతం ఉద్వేగానికి గురయ్యారు.