జక్రాన్‌పల్లి కేజీబీవీలో ఫుడ్‌పాయిజన్
నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లిలోని కస్తుర్బాగాంధీ బాలికల విద్యాలయ విద్యార్థినులు బుధవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కేజీబీవీలో ఇంటర్ ఫస్టియర్ ఒకేషనల్ చదువుతున్న విద్యార్థినులు బుధవారం ఆర్మూర్ ప్రభుత్వ కళాశాలలో ప్రాక్టికల్ పరీక్షకు వెళ్లాల్సి ఉన్నది. విద్యార్థినులు ఉదయం అల్పాహారంగా పెట్టిన పులిహోర తిని పరీక్ష రాయడానికి వెళ్లారు.
- 8 మంది విద్యార్థినులకు అస్వస్థత
- దవాఖానలో చేర్పించిన సిబ్బంది
- తల్లిదండ్రులతో టీచర్ల దురుసు ప్రవర్తన
జక్రాన్‌పల్లి, ఫిబ్రవరి 4: నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లిలోని కస్తుర్బాగాంధీ బాలికల విద్యాలయ విద్యార్థినులు బుధవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కేజీబీవీలో ఇంటర్ ఫస్టియర్ ఒకేషనల్ చదువుతున్న విద్యార్థినులు బుధవారం ఆర్మూర్ ప్రభుత్వ కళాశాలలో ప్రాక్టికల్ పరీక్షకు వెళ్లాల్సి ఉన్నది. విద్యార్థినులు ఉదయం అల్పాహారంగా పెట్టిన పులిహోర తిని పరీక్ష రాయడానికి వెళ్లారు.
వారి వెంట వెళ్లిన టీచర్లు ఆర్మూర్‌లో మరోసారి టిఫిన్ చేయించారు. ఆ తర్వాత పరీక్ష కేంద్రానికి వెళ్తున్న సమయంలో 8 మంది విద్యార్థినులు వాంతులు చేసుకున్నారు. దీంతో వారిని హుటాహుటిన ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం పూజ అనే విద్యార్థినిని నిజామాబాద్‌కు తీసుకెళ్లారు.
టీచర్లపై తల్లిదండ్రుల ఆగ్రహం
విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయాన్ని సిబ్బంది తొలుత తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వలేదు. పిల్లలను దవాఖానకు తీసుకెళ్లగా, తల్లిదండ్రులను రప్పించాలని అక్కడి వైద్యులు చెప్పడంతో చివరకు సమాచారమిచ్చారు. హుటాహుటిన దవాఖానకు వచ్చిన తల్లిదండ్రులు టీచర్లపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పిల్లలకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యులని నిలదీశారు. ఈ క్రమంలో టీచర్లు తమపై దురుసుగా ప్రవర్తించారని తల్లిదండ్రులు ఆరోపించారు.
విద్యార్థినుల అస్వస్థత విషయమై కేజీబీవీ ఎస్వో స్వప్నను వివరణ కోరగా, తాను అందుబాటులో లేనని చెప్పారు. హైదరాబాద్‌లో అత్యవసర సమావేశం ఉండటంతో తాను వెళ్లానని వివరించారు. విద్యార్థినుల ఆరోగ్యం బాగుందని, హాస్టల్‌కు తిరిగి వచ్చారని తెలిపారు. పాఠశాల చుట్టుపక్కల పొలాలు ఉండటం, వాటికి వేసే మందుల వాసనతో పిల్లలు అస్వస్థతకు గురయ్యారని డాక్టర్లు చెప్పినట్టు ఎంఈవో శ్రీనివాస్ పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Virosh | జపాన్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దీపావళి వేడుకలు.. విదేశీ గడ్డపై సంప్రదాయ హోమం!
Police Misconduct | పోలీసుల దారిదోపిడీ..! కానిస్టేబుల్,హోంగార్డుపై కేసు.. కానిస్టేబుల్ పరారీ
Renu Desai | దీపావళి వేడుకల్లో రేణూ దేశాయ్.. ‘చంద్రకోర’ తిలకం ధరించి అందరి దృష్టిని ఆకర్షించిన నటి!
Diwali festival | దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం
Bigg Boss Telugu 10 | దీపావళి స్పెషల్ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్.. ఎలిమినేషన్ నుంచి సుధీర్‌కు ఊహించని విముక్తి,కన్నీళ్లు పెట్టుకున్న వర్షిణి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

