హైదరాబాద్ హుస్సేన్‌సాగర్ తీరాన ఒక వైపు ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం.. మరోవైపు ప్రమిద ఆకారంలో అద్భుతంగా రూపుదిద్దుకుంటున్న అమరుల స్మృతి కేంద్రం.. శుక్రవారం సాయం సంధ్యవేళలో అరుణ శోభితమైన నీలాకాశం.. ఓ అపురూప దృశ్యాన్ని ఆవిష్కరించాయి.