దేశ హితం కోసమే బీఆర్ఎస్
బీజేపీ అస్తవ్యస్త విధానాలతో దేశ ఆర్థిక పరిస్థితి నానాటికీ క్షీణించిపోతున్నదని, ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకే సీఎం కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారిందని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు.
- బీజేపీతో అన్ని వర్గాలకు నష్టం
- అస్తవ్యస్త విధానాలు సరిచేసేందుకే బీఆర్ఎస్
- కేసీఆర్ తప్పక విజయం సాధిస్తారు
- రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్
హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): బీజేపీ అస్తవ్యస్త విధానాలతో దేశ ఆర్థిక పరిస్థితి నానాటికీ క్షీణించిపోతున్నదని, ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకే సీఎం కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారిందని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. ఢిల్లీలో బుధవారం బీఆర్ఎస్ జాతీయ కార్యాయం ప్రారంభోత్సవంలో పాల్గొన్న అనంతరం స్థానిక మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు.
నల్లధనం, పేదరిక నిర్మూలన, స్వామినాథన్ సిఫారసుల మేరకు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని, యువతకు ఏటా 2 కోట్ల ఉద్యోగావకాశాలు కల్పిస్తానని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన నరేంద్రమోదీ.. అందులో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. రైతుల పట్ల మోదీ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. 75 ఏండ్లు దేశ ప్రజలు కష్టపడి నిర్మించిన ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, వైజాగ్ స్టీల్ వంటి సంస్థలను, ఆఖరికి ప్రభుత్వ రంగంలో ఉండాల్సిన ఓడరేవులు, ఎయిర్‌పోర్టులను కూడా బీజేపీ సర్కారు తెగనమ్ముతున్నదని మండిపడ్డారు.
ఆర్థిక నేరాలను అరికట్టేందుకు వాజ్‌పేయి హయాంలో ఈడీని ఏర్పాటుచేస్తే, నేటి మోదీ సర్కారు రాజకీయ స్వార్థం కోసం దానిని వాడుకొంటున్నదని ధ్వజమెత్తారు. అన్నింటికీ మించి భారత సమాజ పునాది అయిన ప్రజాస్వామ్య, లౌకిక వాదాలనే బీజేపీ ధ్వంసం చేస్తున్నదని విమర్శించారు. ఈ నేపథ్యంలో దేశానికి కొత్త నాయకత్వం అవసరమని, కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ అవతరించిందని చెప్పారు. రైతు సర్కార్ రావాలన్నదే బీఆర్ఎస్ ఆకాంక్ష అని వెల్లడించారు.
ఇటీవల దేశంలో ఎక్కువగా వరి విస్తీర్ణం పెంచి రాబడి పెంచుకొన్న రాష్ట్రంగా తెలంగాణను సీఎం కేసీఆర్ నిలబెట్టారని తెలిపారు. తెలంగాణ పదాన్ని టీఆర్ఎస్ కోల్పోయిందని కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేయడాన్ని ఆయన ఖండించారు. గుజరాత్ ఎన్నికల కోసం 10 నెలల్లోనే ప్రధాని మోదీ ఆ రాష్ట్రంలో దాదాపు రూ.1.35 లక్షల కోట్ల నిధులు కుమ్మరించారని ధ్వజమెత్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs DRDO | హైదరాబాద్ డీఆర్డీవోలో 195 అప్రెంటిస్ ఖాళీలు.. నవంబర్ 1 చివరితేదీ
Bhagat Singh Photo On Voter List | ఓటర్ల జాబితాలో భగత్ సింగ్ ఫొటో.. విమర్శలపై ఎన్నికల అధికారుల వివరణ
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

