Medical Colleges | మెడికల్ కాలేజీలపై తప్పుడు ప్రచారం.. రాష్ట్ర ప్రభుత్వ కాలేజీలు కేంద్రం ఖాతాలోకి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో ఏర్పాటుచేస్తున్న మెడికల్ కాలేజీలను కేంద్ర ప్రభుత్వ ఖాతాలో వేస్తూ తప్పుడు ప్రచారం జరుగుతున్నది. వాస్తవానికి ఈ ఏడాది నేషనల్ మెడికల్ కమిషన్ దేశవ్యాప్తంగా 50 మెడికల్ కాలేజీలకు అనుమతులు మంజూరు చేసింది.
- ఖండించిన తెలంగాణ వైద్యారోగ్య శాఖ
Medical Colleges | హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో ఏర్పాటుచేస్తున్న మెడికల్ కాలేజీలను కేంద్ర ప్రభుత్వ ఖాతాలో వేస్తూ తప్పుడు ప్రచారం జరుగుతున్నది. వాస్తవానికి ఈ ఏడాది నేషనల్ మెడికల్ కమిషన్ దేశవ్యాప్తంగా 50 మెడికల్ కాలేజీలకు అనుమతులు మంజూరు చేసింది. ఇందులో ప్రభుత్వ, ప్రైవేట్, ట్రస్ట్ ఆధ్వర్యంలో నడిచే కాలేజీలు ఉన్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణలో ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొమ్మిది మెడికల్ కాలేజీలతోపాటు మరో నాలుగు ప్రైవేట్ కాలేజీలకు ఎన్ఎంసీ అనుమతులు ఇచ్చింది.
ఇది ప్రతి సంవత్సరం జరిగే సాధారణ ప్రక్రియ. ఈ విషయాన్ని తప్పుదోవ పట్టిస్తూ కేంద్ర ప్రభుత్వమే ఈ ఏడాది 50 మెడికల్ కాలేజీలు మంజూరు చేసినట్టుగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం మొదలైంది. కేంద్ర వైద్యారోగ్యశాఖ తెలంగాణకు 13 మెడికల్ కాలేజీలు మంజూరు చేసిందని కొందరు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో ఏర్పాటుచేస్తున్న కాలేజీలను కేంద్రం ఖాతాలో వేయడానికి ప్రయత్నించారు. ఈ ప్రచారాన్ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఖండించింది. కేంద్రం కేవలం అనుమతులు ఇచ్చిందని, కాలేజీల ఏర్పాటులో ఒక్క రూపాయి కూడా కేంద్రం వాటా లేదని స్పష్టం చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

