హైదరాబాద్, అక్టోబర్17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్త బీసీ బంద్‌కు అంతా సిద్ధమయ్యారు. అఖిలపక్షాలు మద్దతు తెలిపాయి. కుల, ప్రజాసంఘాలు సంఘీభావంగా నిలిచాయి. బంద్ విజయవంతం కోసం ఊరూరా బీసీ ప్రతినిధులు ప్రచారం నిర్వహించారు. బంద్‌లో పాల్గొనాల్సిందిగా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునివ్వడం మరింత ఊపునిచ్చినట్టయింది. దీంతో శనివారం నిర్వహించనున్న బంద్ వాతావరణం శుక్రవారం నుంచే కనిపించింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం ‘బంద్ ఫర్ జస్టిస్’ పేరిట బీసీ సంఘాల జేఏసీ శనివారం రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్ పిలుపుతో సకలజనుల మద్దతు వెల్లువెత్తుతున్నది. బీసీ రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు స్టే విధించగా, సుప్రీంకోర్టులో సర్కార్‌కు చుక్కెదురైంది.
ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు రాష్ట్రంలోని పలు బీసీ సంఘాలన్నీ కలిసి బీసీ ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పడ్డాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ చూపి బీసీలకు రిజర్వేషన్లను కల్పించాల్సిందేనని పట్టుబడుతున్నాయి. ఉద్యమంతో పాలకుల మెడలు వంచేందుకే బీసీలు సిద్ధమయ్యారు. ఈ ఉద్యమం కేవలం బీసీలకే కాకుండా, రాష్ట్రంలోని ఇతర వెనుకబడిన వర్గాల సాధికారతకు అవసరమని, సంయుక్త సంఘాలు, ప్రజలు, వ్యాపారులు సమిష్టిగా పాల్గొని సహకరించాలని పార్టీలు, ఆయా సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర బంద్‌లో సబ్బండవర్ణాలు పాల్గొని విజయవంతం చేయాలని బీసీ సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది. ఇప్పటికే ఓయూ ఐక్య విద్యార్థి సంఘం, పీడీఎస్‌యూ, విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం, ముదిరాజ్, సర్దార్ సర్వాయిపాపన్న మోకుదెబ్బ గౌడసంఘం, లంబాడీ హకుల పోరాట సమితి సైతం బంద్‌కు జై కొట్టాయి. తాజాగా హైదరాబాద్ గౌడ హాస్టల్ అధ్యక్షుడు మోతె చక్రవర్తిగౌడ్, ముస్లిం దూదేకుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ రాజమ్మద్, బీసీ ఉద్యమ పోరాట మహిళా సంఘాల అధ్యక్షుడు అలేఖ్య, తదితర సంఘాలు, నాయకులు మద్దతు ప్రకటించారు.
బంద్ విజయవంతం కోరుతూ హైదరాబాద్‌లోని బషీర్బాగ్బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహం నుంచి ట్యాంక్‌బండ్ అంబేదర్ విగ్రహం వరకు అఖిలపక్ష నేతలతో బీసీ జేఏసీ నేతలు శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బీసీ సం ఘాల జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ, బీసీ జేఏసీ వరింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ మా ట్లాడారు. బంద్ కార్యక్రమం ఏ వర్గాలకు, కులాలకు వ్యతిరేకం కాదని, కేవలం బీసీల న్యాయమైన హకుల కోసం జరిగే పోరాటమేనని వారు స్పష్టం చేశారు. బంద్‌లో సకలజనులు పాల్గొనాలని వారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. వారితోపాటు ర్యాలీలో బీసీ సంఘాల జేఏసీ వైస్ చైర్మన్ వీజీఆర్ నారగోని, కో చైర్మన్లు రాజారామ్‌యాదవ్, దాసు సురేశ్, ఎల్‌హెచ్‌పీఎస్ నేత సంజీవ్‌నాయక్, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల కృష్ణ, ఓయూ జేఏసీ నేత జకుల మధుయాదవ్, విద్యార్థి, నిరుద్యోగ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కొంపెల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్టు రిజర్వేషన్లను కల్పించే అంశాన్ని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకే బాధ్యతను అప్పగించాలని బీసీ జేఏసీ కో చైర్మన్ రాజారాంయాదవ్ డిమాండ్ చేశారు. 42శాతం రిజర్వేషన్లకు న్యాయపరమైన అడ్డంకులు రావడానికి సీఎం రేవంత్‌రెడ్డి పూర్తి బాధ్యత వహించాలని స్పష్టంచేశారు. రాజ్యాంగ సవరణ ఒకటే బీసీ రిజర్వేషన్లకు శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. బీసీగా చెప్పుకునే ప్రధాని మోదీ.. రాత్రికి రాత్రి ఆర్డినెన్స్ తెచ్చి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించారని, మరి బీసీల కోసం ఎందుకు బిల్లును ఆమోదించడం లేదని లేదని ప్రశ్నించారు.
బీసీ బంద్ విజయవంతం కోరుతూ హైదరాబాద్ విద్యానగర్‌లో శుక్రవారం ఆటో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ర్యాలీలో పాల్గొన్న ఆర్ కృష్ణయ్య మాట్లాడారు. బీసీ ఉద్యమానికి సబ్బండ వర్గాల సంపూర్ణ మద్దతు లభిస్తున్నదని తెలిపారు. బీసీ ఉద్యమానికి వస్తున్న ఆదరణతో ఇక రిజర్వేషన్ల అంశాన్ని ఎవరూ ఆపలేరని స్పష్టంచేశారు. ర్యాలీలో బీసీ సంఘం నాయకుడు పీ రాజ్‌కుమార్, ఓయూ జేఏసీ నేత రాజు, మణికంఠ, ఆటో యూనియన్ నాయకులు శ్రీనివాస్, రామకృష్ణ, జాహంగీర్, మల్లేశ్, మహేశ్, వెంకటేశ్‌గౌడ్, రాజేశ్, రాము, సంతు, రామస్వామి నిఖిల్, వంశీ తదితరులు పాల్గొన్నారు.
బీసీ రిజర్వేషన్ల అంశంపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నాయని పలువురు నేతలు మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్ సాధన కోసం ఈ నెల 24న చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించి ఇదిరాపార్కు ధర్నాచౌక్ వద్ద మహాధర్నా చేపట్టనున్నట్టు 42 శాతం బీసీ రిజర్వేషన్ సాధన సమితి వెల్లడించింది. హైదరాబాద్ చిక్కడపల్లిలోని బీసీ పొలిటికల్ ఫ్రంట్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో బీసీ మేధావుల ఫోరం చైర్మన్ చిరంజీవులు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగౌని బాల్‌రాజ్, బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ కన్వీనర్ డాక్టర్ విశారధన్ మహారాజ్ మాట్లాడారు.
శనివారం బీసీలు తలపెట్టిన బంద్, నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. బీసీల రిజర్వేషన్ల కోసం పార్లమెంట్లో చట్టం చేసే వరకూ విశ్రమించబోమని స్పష్టంచేశారు. వచ్చే శీతాకాల సమావేశంలో పార్లమెంట్లో చట్టం చేసి 9వ షెడ్యూల్డ్‌లో చెర్చాలని వారు డిమాండ్ చేశారు. సమావేశంలో బీసీ పొలిటికల్ ఫ్రంట్ కన్వీనర్ అయిలి వెంకన్నగౌడ్, స్టీరింగ్ కమిటీ సభ్యులు అంబాల నారాయణగౌడ్, బీసీ సంఘాల నాయకులు ఎర్రమాద వెంకన్న నేత, గడ్డమీది విజయ్ కుమార్‌గౌడ్, ఒంటెద్దు నరేందర్, పోతగాని ఐలన్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించేంత వరకూ తెలంగాణ ఉద్యమం తరహాలోనే బీసీ ఉద్యమాన్ని చేపడుతామని పలువురు నాయకులు స్పష్టంచేశారు. శనివారం రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ శుక్రవారం హైదరాబాద్‌లో బీసీ మహార్యాలీ నిర్వహించారు. బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య, వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్, వైస్ చైర్మన్ వీజీఆర్ నారగోని, కో చైర్మన్ దాసు సురేశ్, రాజారాంయాదవ్ నేతృత్వంలో ఈ ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో ఇంకా టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, బీజేపీ ఎమ్మెల్యే పాయల శంకర్, మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, గిరిజన ఐక్యవేదిక అధ్యక్షుడు సంజీవనాయక్, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సుధాకర్ తదితరులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు.
ఆయా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ బంద్‌లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలను స్వచ్ఛందంగా మూసి వేసి సహకరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీసీ జేఏసీ కోఆర్డినేటర్లు గుజ్జ కృష్ణ, కుల్కచర్ల శ్రీనివాస్, ప్రొఫెసర్ సంఘవి మల్లేశ్వర్, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేషాచారి, మనిమంజరి, కనకాల శ్యాం, మంద భాస్కర్, నిమ్మల వీరన్న, వీరేందర్‌గౌడ్, పద్మావతి, జ్ఞానేశ్వర్, వారాల శ్రీనివాస్, నరేష్, సంధ్యసమతాయాదవ్ తదితరులు పాల్గొన్నారు.