హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలవుతున్నా సర్పంచుల సమస్యలు పరిష్కరించలేదని రాష్ట్ర సర్పంచుల జేఏసీ (Telangana Sarpanch JAC) అధ్యక్షుడు యాదయ్య గౌడ్ అన్నారు. 2019-24 మధ్య పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే పెండిగ్లో ఉన్న బిల్లులను చెల్లించాలంటూ రాష్ట్ర సర్పంచుల సంఘం జేఏసీ సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా సచివాలయంవైపు ర్యాలీగా వెళ్తున్న సర్పంచులను అడ్డుకున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా యాదయ్య గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. అప్పుల బాధలు తట్టుకోలేక కొందరు సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారని వాపోయారు.
వడ్డీలకు అప్పులు తెచ్చి గ్రామాల్లో అభివృద్ధి చేశామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలైనా తమ సమస్యలు పరిష్కరించలేదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే జోక్యం చేసుకుని పెండింగ్ బిల్లులు చెల్లించాలన్నారు. సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన తమను అరెస్టు చేయడం సరికాదని చెప్పారు.
సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చిన సర్పంచులు
ఈ నేపథ్యంలో ములుగు నుండి వచ్చిన ఇద్దరు సర్పంచులను సెక్రటేరియట్ వద్ద అరెస్ట్ చేసిన పోలీసులు pic.twitter.com/WEe9EdOO5v
— Telugu Scribe (@TeluguScribe) August 2, 2024