హైదరాబాద్, జూన్ 5(నమస్తే తెలంగాణ): దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈనెల 11న తెలంగాణ సాహిత్య దినోత్సవాన్ని నిర్వహించనున్నట్టు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కవి సమ్మేళనాలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.
దాశరథి, కాళో జీ, సినారె, బిరుదురాజు రామరాజు, భాగ్యరెడ్డివర్మ, కొమర్రాజు, బీఎన్ శాస్త్రి, బోయ జంగయ్య, జాతశ్రీ వంటి తెలంగాణ తేజోమూర్తులు పుట్టి పెరిగిన ఊర్లలో వారిని గుర్తు చేసుకుంటూ స్థానికంగా కార్యక్రమాలు రూపొందించనున్నట్టు తెలిపారు. 11 న జరిగే కవి సమ్మేళనాల్లో పాల్గొనే వారికి వచన, పద్య కవిత విభాగాల్లో ప్రథమ బహుమతి కింద రూ.1,00,116, ద్వితీయ బహుమతిగా రూ. 75,116, తృతీయ బహుమతి కింద రూ. 60,116, నాలుగో బహుమతి కింద రూ. 50,116, పంచమ బహుమతి కింద రూ. 30,116 నగదు బహుమతి ఇస్తామని తెలిపారు.