ఆదివారం 12 జూలై 2020
Telangana - Jun 23, 2020 , 01:23:47

తాజా కేసులు.. 872

తాజా కేసులు.. 872

  • జీహెచ్ 713 మందికి పాజిటివ్
  • ఏడుగురు మృతి, 274 మంది డిశ్చార్జి
  • ఇప్పటికి 60వేలకుపైగా నిర్ధారణ పరీక్షలు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కేసులు బుగులు పుట్టిస్తున్నాయి. ఏ రోజుకా రోజు రికార్డుస్థాయిలో నిర్ధారణ అవుతూ భయాందోళనకు గురిచేస్తున్నాయి. సోమవారం ఒక్కరోజే 872 కేసులు వెలుగుచూశాయి. అత్యధికంగా జీహెచ్ పరిధిలో 713 మంది పాజిటివ్ తేలినట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్ పేర్కొన్నది. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 107 కేసులు, మేడ్చల్ 16, సంగారెడ్డి 12, వరంగల్ రూరల్ 6, మంచిర్యాల 5, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో 3 చొప్పున, మహబూబాబాద్, కరీంనగర్, జనగామ జిల్లాల్లో 2 చొప్పున, వరంగల్ అర్బన్ జిల్లాలో ఒక కేసు నమోదయ్యాయి. చికిత్స పొందుతున్నవారిలో ఏడుగురు మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 217కు చేరింది. సోమవారం మొత్తం 3,189 నమూనాలను పరీక్షించగా, ఇందులో 2,317 నెగెటివ్ వచ్చాయి. మరోవైపు రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 60,249 చేరింది. ఇదిలా ఉండగా.. కరోనా రోగులకు చికిత్స అందించడానికి గాంధీ దవాఖానకు మరో 400 వెంటిలెటర్లను ప్రభుత్వం మంజూరు చేసింది. 


logo