మేడిపల్లి, జూలై 18 : రాష్ట్రంలో ప్రైవేట్ ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చినప్పటి నుంచి ప్రజలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ రియల్టర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నారగోని ప్రవీణ్‌కుమార్, ఉపాధ్యక్షుడు మేకపోతుల నర్సయ్య, ప్రధాన కార్యదర్శి పగడాల రంగారావు పేర్కొన్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.
ఈ సమస్య కారణంగా ఆస్తుల కొనుగోలు, రిజిస్ట్రేషన్లు నిలిచిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. బ్యాంకులు హౌసింగ్, మార్టిగేజ్ రుణాలు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్లాట్స్, ఇండ్ల రిజిస్ట్రేషన్లకు సంబంధించి కలెక్టర్ నుంచి ఎన్వోసీ తీసుకురావాలనడం సరికాదన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకొని సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.