హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని తెలంగాణ ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు తన వంతు కృషిచేస్తానని తెలిపారు.
ఢిల్లీలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని రాష్ట్ర విభజన సందర్భంగా నాటి ప్రధాని మన్మోహన్సింగ్ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఆ హామీని కేంద్రం ఇప్పటికీ నెరవేర్చక పోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.