హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో మళ్లీ ముంబై, దుబాయి వలసలే దిక్కయ్యేలా ఉందని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణ పరువు తీస్తున్నారని, కేసీఆర్ పాలనలో ఉద్యోగ, ఉపాధి కల్పనలో నంబర్‌వన్‌గా ఉన్న తెలంగాణను నిరుద్యోగంలో నంబర్‌వన్‌గా మార్చారని రెడో మాజీ చైర్మన్ వై సతీశ్‌రెడ్డి విమర్శించారు. కేంద్రం ప్రకటించిన తాజా లెకల ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో నిరుద్యోగిత రేటు 8.9 శాతానికి చేరిందని, ఇది దేశంలోనే అత్యధికమని మంగళవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. జనవరి 2022లో తెలంగాణ నిరుద్యోగిత రేటు.. 0.7 శాతంగా ఉంటే.. ఇప్పుడు అది 8.9 శాతానికి పెరిగిందని ఆందోళన వ్యక్తంచేశారు. తీవ్రమైన కరోనా ఉధృతిలో కూడా తెలంగాణ నిరుద్యోగిత రేటు 5.8 శాతంగా ఉన్నదని, ఇప్పుడు ఎలాం టి విపత్తు లేకున్నా అత్యధిక శాతానికి పెరగడం ఏమిటని ప్రశ్నించా రు. ఇదే పరిస్థితి కొనసాగితే.. ఉపా ధి లేక, పనులు దొరక.. పొట్ట చేతపట్టుకుని.. ముంబై, దుబాయి వలసలు పోయిన రోజులు తిరిగి వస్తాయని ఆవేదన వ్యక్తంచేశారు.