హైదరాబాద్, ఫిబ్రవరి19 (నమస్తే తెలంగాణ): కులగణన సర్వేలో పాల్గొనని వారు ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని.. వివరాలను నమోదు చేసుకోవాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం ఒక ప్రకటనలో కోరారు. ఈనెల 28 వరకు రీసర్వే కొనసాగుతుందని పేర్కొన్నారు.
మూడు పద్ధతుల్లో కుల సర్వేలో సమాచారం ఇవ్వడానికి అవకాశం కల్పించామని తెలిపారు. ఇప్పటి వరకు సమాచారమివ్వనివారు సర్వేలో భాగస్వాములవ్వాలని కోరారు. విమర్శలకే పరిమితం కాకుండా ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.