Harish Rao | ప్రభుత్వ బడుల్లో జీరో డ్రాపౌట్స్.. కేసీఆర్ పాలనకు మరోసారి నీతి ఆయోగ్ ప్రశంస.. వెల్లడించిన హరీశ్‌రావు
Harish Rao | కేసీఆర్ ప్రభుత్వంలో విద్యావ్యవస్థ నిర్లక్ష్యానికి గురైందని కాంగ్రెస్, బీజేపీ నాయకులు చేస్తున్న ఆరోపణలపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు మండిపడ్డారు. తెలంగాణలో కేసీఆర్ పదేళ్ల పాలనలో విద్యా రంగం అద్భుతమైన ప్రగతి సాధించిందని కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ తేల్చిచెప్పిందని తెలిపారు.
Harish Rao | కేసీఆర్ ప్రభుత్వంలో విద్యావ్యవస్థ నిర్లక్ష్యానికి గురైందని కాంగ్రెస్, బీజేపీ నాయకులు చేస్తున్న ఆరోపణలపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు మండిపడ్డారు. తెలంగాణలో కేసీఆర్ పదేళ్ల పాలనలో విద్యా రంగం అద్భుతమైన ప్రగతి సాధించిందని కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ తేల్చిచెప్పిందని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైందంటూ కాంగ్రెస్, బీజేపీ, కొంతమంది స్వయం ప్రకటిత మేధావులు చేస్తున్న ఆరోపణలు పచ్చి అబద్ధాలని, సత్యదూరమని ఈ నివేదికతో తేటతెల్లమైందని పేర్కొన్నారు.
నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా నివేదిక (2014-15 నుంచి 2024-25) బీఆర్ఎస్ ప్రభుత్వ చిత్తశుద్ధికి సాక్ష్యంగా నిలిచిందని హరీశ్‌రావు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయిలో జీరో డ్రాపౌట్స్ నమోదును నీతి ఆయోగ్ ప్రశంసించిందని పేర్కొన్నారు. విద్యార్థుల నమోదు (GER) లో ముఖ్యంగా బాలికల విద్యలో తెలంగాణ జాతీయ సగటును మించి రికార్డు సృష్టించిందని చెప్పారు.
పదేళ్లలో ప్రభుత్వ బడుల్లో కరెంటు, మరుగుదొడ్లు, తాగునీటి వసతులతో పాటు.. 86 శాతం స్కూళ్లకు కంప్యూటర్లు అందించి దేశంలోనే అగ్రభాగంలో నిలిచిందని హరీశ్‌రావు తెలిపారు. తెలంగాణలో గురుకులాల ఏర్పాటు, ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణతో విద్యా రంగానికి కేసీఆర్ ఎంత పెద్దపీట వేశారో చెప్పడానికి కేంద్ర ప్రభుత్వమిచ్చిన ఈ గణాంకాలే నిదర్శనమని అన్నారు. రాజకీయాల కోసం కేసీఆర్‌పై, గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేసే వారికి నీతి ఆయోగ్ నివేదిక చెంపపెట్టు అని విమర్శించారు.
తెలంగాణలో కేసీఆర్ గారి పదేళ్ల పాలనలో విద్యా రంగం అద్భుతమైన ప్రగతి సాధించిందని కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ తేల్చిచెప్పింది. కేసీఆర్ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైందంటూ కాంగ్రెస్, బీజేపీ, కొంతమంది స్వయం ప్రకటిత మేధావులు చేస్తున్న ఆరోపణలు పచ్చి అబద్ధాలని,… pic.twitter.com/U93dcned8N
— Harish Rao Thanneeru (@BRSHarish) May 8, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
నేడు సింగరేణి గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

