హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): బార్బడోస్‌లో జరుగుతున్న 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్(సీపీఏ) కాన్ఫరెన్స్ అనంతరం పర్యటనలో భా గంగా తెలంగాణ శాసనసభ బృందం ప్యారిస్‌లో పర్యటించింది. శుక్రవారం ప్యారిస్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్ గడ్డం ప్ర సాద్‌కుమార్, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, లేజిస్లేచర్ సెక్రటరీ వీ నరసింహాచార్యులు, అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా భారత రాయబార కార్యాలయ చీఫ్ అంబాసిడర్ సంజీవ్ సింఘాలాతో సమావేశమయ్యారు. తెలంగాణలోని పారిశ్రామిక, పర్యాటక అంశాలను వివరించారు. అనంతరం చీఫ్ అంబాసిడర్‌ను బృందం సన్మానించింది.