హైదరాబాద్, మార్చి 7 (నమస్తేతెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల ముందు మహిళలకు ఇచ్చిన హామీలను కాం గ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని తెలంగాణ జాగృతి నాయకులు నవీన్ ఆచారి, మారపల్లి మాధవి, రూప్సిం గ్ డిమాండ్ చేశారు. లేదంటే జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రారంభించిన పోస్ట్‌కార్డుల ఉద్యమంలో భాగంగా సీఎంకు రాసిన 10వేల కా ర్డులను శుక్రవారం ప్రజాభవన్‌లో ని ప్రజావాణిలో అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రె స్ అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని నిలదీశారు. కార్యక్రమంలో నరేందర్‌యాదవ్, సంతోష్, మారయ్య పాల్గొన్నారు.