జయశంకర్ భూపాలపల్లి : తెలంగాణ జల ప్రధాత సీఎం కేసీఆర్( CM KCR ) ప్రత్యేక శ్రద్ధ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project)తో తెలంగాణ సస్యశ్యామలమయ్యిందని రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్(Mla Korukanti Chander) అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మెడిగడ్డ లక్ష్మి బ్యారేజ్ ను తెలంగాణ అసెంబ్లీ బీసీ సంక్షేమ కమిటీ చైర్మన్, షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశంతో కలిసి ప్రాజెక్టును సందర్శించారు.
ఈ సందర్భంగా ప్రాజెక్టు వివరాలను ప్రాజెక్టు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు 500 కిలోమీటర్ల మేర ప్రవహిస్తూ దాహార్తిని, పారిశ్రామిక అవసరాలను తీరుస్తూ లక్షలాది ఎకరాలకు సాగునీరందిస్తుందని అన్నారు. తూర్పుకు ప్రవహించి సముద్రంలో వృథాగా కలుస్తున్న నీటిని ఒడిసిపట్టి, పడమరకు ఎక్కించి, ప్రజల అవసరాలను తీరుస్తున్న అపర భగీరథుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు.