హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): మోదీ ప్రభుత్వం సహకరించకపోయి నా, ప్రతిపక్షాలు ఇబ్బంది పెడుతున్నా తెలంగాణలో అభివృద్ధి ఆగలేదని బీఆర్ఎస్ ఎమ్మె ల్సీ కవిత స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వాన్ని అడుగడుగునా ఇబ్బం ది పెడుతున్నదని ఆరోపించారు. రాష్ట్రంలో కూడా ప్రతిపక్షాలు ఇబ్బంది పెడుతున్నా, పట్టుదలతో రాష్ట్రాన్ని పురోగతి బాటలో కేసీఆర్ నడిపిస్తున్నారని చెప్పారు. శనివారం మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో ఎమ్మెల్సీ కవిత ప్రసంగించారు.
ఇతర రాష్ర్టాలకు ప్రేరణగా తెలంగాణ
రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమం, పథకాలు దేశంలోని అన్ని రాష్ట్రాలకు ప్రేరణగా నిలుస్తున్నాయని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. దాదాపు 17-18 రాష్ట్రాల ప్రతినిధులు తెలంగాణకు వచ్చి అనేక కార్యక్రమాలను అధ్యయనం చేశారని గుర్తు చేశారు. ఇటీవల ఖమ్మంలో జరిగిన భారీ సభకు హాజరైన డిల్లీ, పంజాబ్ సీఎంలు కేజ్రివాల్, భగవంత్‌సింగ్ తెలంగాణలో అమలుచేస్తున్న కంటి వెలుగు పథకంతో స్ఫూర్తి పొంది, వెంటనే వారి రాష్ట్రాల్లోనూ అమలు చేస్తామని ప్రకటించడం తెలంగాణకు, సీఎం కేసీఆర్‌కు దకిన గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.
పెరిగిన తలసరి ఆదాయం
2014లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,24,104 ఉండేదని, 2022 నాటికి అది రూ.3,17,118కు పెరిగిందని వెల్లడించారు. ఇందుకు కేసీఆర్ పాలనే కారణమని చెప్పారు. విద్య, వైద్యం, వ్యవసాయం, ఉద్యోగ, ఉపాధి కల్పన, పెన్షన్లు, పెట్టుబడులు, పరిశ్రమల వంటి రంగాలతోపాటు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, అడవుల పెంపకం, ఆలయాల అభివృద్ధి, దళిత వర్గాల అభివృద్ధి, మైనారిటీల అభివృద్ధి, బీసీల అభివృద్ధి, అగ్రవర్ణ పేదల సంక్షేమం.. ఇలా ఏ అంశాన్ని తీసుకున్నా కేసీఆర్ ప్రభుత్వం ఏ ఒకరినీ విస్మరించలేదని వివరించారు.
లక్షల ఉద్యోగాల కల్పన
ప్రైవేటు పెట్టబడులను ఆకర్షించి దాదాపు 30 లక్షలకు పైగా ఉద్యోగాలను కేసీఆర్ ప్రభుత్వం కల్పించిందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. 2 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని గుర్తు చేశారు. తెలంగాణ తల్లి అన్నపూర్ణగా మారిందని తెలిపారు. కంటి వెలుగును కౌన్సిల్లోనూ ఏర్పాటు చేయాలని చైర్మన్‌కు కవిత విజ్ఞప్తి చేయగా, ఆయన అంగీకరించారు. ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు.
తగ్గిన మాతా,శిశు మరణాలు
గతంలో రాష్ట్రంలో ప్రతి లక్ష ప్రసవాలకు 92 మంది మరణించేవారని, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల వల్ల అవి 43కు తగ్గాయని పేరొన్నారు. శిశువుల మరణాలు కూడా తగ్గాయని అన్నారు. పోషకాహారాన్ని అందించే అంగన్వాడీ, ఆశా వరర్ల వ్యవస్థను సీఎం కేసీఆర్ బలోపేతం చేశారని స్పష్టం చేశారు. ప్రత్యేకంగా 35,700 అంగన్ వాడీ సెంటర్లు ఉన్నాయని, వాటిల్లో పనిచేసే వరర్ల వేతనం చాలా తకువగా ఉండేదని, దాన్ని సీఎం కేసీఆర్ రూ.13,650కు పెంచారని తెలిపారు. అందులో కేంద్రం వాటా కేవలం రూ.2,700 మాత్రమేనని, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.10,950 అని వెల్లడించారు. ఆశా వరర్ల వేతనం రూ.2 వేలుగా ఉండేదని, దాన్ని రూ.9,750కు పెంచామని గర్తు చేశారు. ఇందులోనూ కేంద్రం వాటా కేవలం రూ.1,200 మాత్రమేనని ఎండగట్టారు. ఆరోగ్య లక్ష్మి పథకం వల్ల రాష్ట్రంలో 35 లక్షల మంది గర్భిణులకు లబ్ధి జరిగిందని చెప్పారు.