కృష్ణా నీటి పంపకాలపై అసత్య ప్రచారం
కృష్ణా జలాలపై కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ ఎలాంటి నీటి పంపకాలను చేపట్టలేదని తెలంగాణ సాగునీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
- సాగునీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్
హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): కృష్ణా జలాలపై కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ ఎలాంటి నీటి పంపకాలను చేపట్టలేదని తెలంగాణ సాగునీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణకు 6.04, ఏపీకి 26.29 టీఎంసీలను కేటాయిస్తున్నట్టు కేఆర్ఎంబీ ప్రతిపాదించిందని వివిధ పత్రికల్లో వచ్చిన కథనాలకు ఖండించారు.
ఈ నెల 21న తెలంగాణ గైర్హాజరుతో త్రిసభ్య కమిటీ సమావేశం జరగలేదని, తాగునీటి అవసరాలపై మాత్రమే కేఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ చర్చించారని తెలిపారు. ఎలాంటి నీటి పంపకాలూ జరగలేదని, ప్రతిపాదనలకు తెలంగాణ అంగీకరించలేదని, బోర్డు కూడా ఎలాంటి లేఖలు రాయలేదని స్పష్టం చేశారు.
త్రిసభ్య సమావేశాన్ని నిర్వహించి, ఇప్పటివరకు ఇరు రాష్ట్రాల వినియోగాలు, నీటి నిల్వలను పరిగణనలోకి తీసుకోవాలని, తాగునీటి అవసరాలను మదింపు చేసి ఆ మేరకు కేటాయింపులు జరపాలని త్రిసభ్య కమిటీ కన్వీనర్ (మెంబర్ సెక్రటరీ)ను గురువారం కలిసిన సందర్భంగా రాష్ట్ర ఈఎన్సీ మురళీధర్ డిమాండ్ చేశారు. ఇరు రాష్ర్టాల అంగీకారం మేరకే తాగునీటి కేటాయింపులపై నిర్ణయం తీసుకోవాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
శ్రీ రామలింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ను సత్వరమే పూర్తి చేయాలి : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
KTR | సహకార సంఘాల బలోపేతానికి బీఆర్ఎస్ సహకారం : కేటీఆర్
Plague Disease | ప్లేగు వ్యాధిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ఎలా వస్తుంది..?
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

