హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): ‘విప్లవాలు అనేక రకాలు. ఒక విప్లవం తరువాత మరో విప్లవం వస్తుంది. వాటి ఫలితాలు కొత్త పుంతలు తొకుతాయి. కానీ, అక్రమ నిర్మాణాలకు వసూళ్ల విప్లవం ఒకటి వచ్చింది. ఇష్టానుసారంగా అక్రమ నిర్మాణలు చేసేయడం.. ఆపై వాటి క్రమబద్ధీకరణకు లేదా వాటి విషయంలో జోక్యం చేసుకోవద్దంటూ కోర్టుల్లో కేసులు దాఖలు చేయడం. మరో పక అక్రమ నిర్మాణాలు కొనసాగేలా అక్రమ వసూళ్ల దందా.. ఒక విప్లవం మాదిరిగా కొనసాగుతున్నాయి. ఇలాంటి కేసుల తరఫున వాదించే న్యాయవాదులు భవిష్యత్తు ఎలా ఉంటుందోనన్న ఆలోచన కూడా చేయాలి. న్యాయవాదులు, న్యాయమూర్తులు వస్తూపోతూ ఉంటారు. ఇలాంటి అక్రమ నిర్మాణాలు పెరిగితే, భావితరాలకు నష్టం జరుగుతుంది. అక్రమ నిర్మాణాలతో భవిష్యత్తు తరాలకు ముప్పు ఏర్పడుతుంది. అనేక సమస్యలు చుట్టుముడుతాయి’ అంటూ హైకోర్టు (High Court) తీవ్రస్థాయిలో ఘాటు వ్యాఖ్యలు చేసింది. అక్రమ నిర్మాణాలతో పారింగ్ పెద్ద సమస్యగా మారిందని, దీనికితోడు నీరు, మురుగునీటి పారుదల సమస్య జఠిలంగా మారిందని ఆందోళన వ్యక్తంచేసింది. మౌలిక సదుపాయాల కల్పన ఎలా చేయాలో తెలియని గందరగోళ పరిస్థితుల్లో రోడ్లు కూడా ఇరుకిరుకుగా మారిపోయి ట్రాఫిక్ సమస్య ఏర్పడుతున్నదంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ‘హైదరాబాద్ మహానగరంలో ఒక ఇంటికి మరో ఇంటికి సంబంధాలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి.
ఇరుగుపొరుగుల మధ్య సత్సంబంధాలు దాదాపు శూన్యం. ఇలాంటి పరిస్థితుల్లో అక్రమ నిర్మాణాలు ఇష్టానుసారంగా సాగుతుంటే.. పట్టించుకునే నాథుడే కరువవుతున్నాడు’ అని వ్యాఖ్యానించింది. ఆదాయ రాబడుల కోసం భూములను భార్యల పేరుతో కొనుగోలు చేస్తూ..ఆ భూముల్లో గంజాయి సాగు చేస్తున్నారు. ఈ కేసుల్లో మహిళలే ఎకువగా నిందితులుగా ఉంటున్నారని తెలిపింది. మహిళల పేరిట భూమి ఉంటే పోలీసులు పట్టించుకోరనే భావనలో ఇలాంటి తప్పులు చేస్తున్నారని వ్యాఖ్యానించింది.
మేడ్చల్-మలాజిగిరి జిలా,్ల ఘట్కేసర్ మండలం, పర్వతాపురంలో సర్వే నం.17లోని 175 చదరపు గజాల్లో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేస్తున్నారనే ఫిర్యాదును మున్సిపల్ అధికారులు పట్టించుకోవడంలేదంటూ బీ సంజీవ్‌కుమార్ వేసిన పిటిషన్‌పై గురువారం న్యాయమూర్తి జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టిన సందర్భంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అక్రమ నిర్మాణాల కారణంగా మన పిల్లల భవిష్యత్తుపై ప్రతికూలత ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 175 చదరపు గజాల్లో జీ ప్లస్-2 అంతస్థులకు అనుమతి తీసుకుని నాలుగు అంతస్థులను ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. పిటిషనర్‌తోపాటు అక్రమ నిర్మాణం చేపట్టిన వ్యక్తి అన్నదమ్ములని న్యాయవాది చెప్పడంతో.. ఆస్తి వివాదాలతో అక్రమ నిర్మాణాలపై ఎలా ఫిర్యాదు చేస్తారని ప్రశ్నించారు. అక్రమ నిర్మాణం విషయాన్ని మున్సిపాలిటీ చూసుకుంటుందని అన్నారు. విచారణకు అన్నదమ్ములు ఇద్దరూ హాజరుకావాలని ఆదేశించారు. తదుపరి విచారణను వాయిదా వేశారు.
పెన్షన్ లెకింపునకు తాత్కాలిక సర్వీసును లెకించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను అందరికీ ఎందుకు అమలు చేయడం లేదని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. క్రమబద్ధీకరణకు ముందున్న తాతాలిక సర్వీస్ లెకింపు విషయంలో దాని పరిధిలోకి వచ్చేవారికి ఆ ఉత్తర్వులను ఎందుకు అమలు చేయడంలేదో చెప్పాలని కోరింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల పరిధిలోకి వచ్చే వ్యక్తిగత దరఖాస్తుదారులు హైకోర్టులో వ్యాజ్యాలు ఎందుకు వేశారని ప్రశ్నించింది. తాత్కాలిక సర్వీసును పెన్షన్ లెకింపులో పరిగణనలోకి తీసుకోకపోవడం అన్యాయమంటూ ప్రభుత్వ హోమియో మెడికల్ కాలేజీ రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం విజయలక్ష్మి, డాక్టర్ టీ హేమావతి వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జస్టిస్ మొహియుద్దీన్‌తో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. పెన్షన్ లెకింపులో తాత్కాలిక సర్వీసును పరిగణనలోకి తీసుకోవాలని 2012లో ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఆదేశించిందని పిటిషనర్ల తరఫు న్యాయవాది చెప్పారు. ఈ వివాదం చివరికి సుప్రీంకోర్టు వరకు చేరిందని, ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పీని 2022లో సుప్రీంకోర్టు కొట్టేసిందని వివరించారు. కౌంటర్ దాఖలుకు నాలుగు వారాల గడువు కావాలని కోరారు. న్యాయపరమైన అడ్డంకులు లేకపోతే సుప్రీం ఉత్తర్వులను అమలు చేస్తామని చెప్పారు. విచారణను కోర్టు నవంబర్ 12కు వాయిదా వేసింది.