హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్‌లో 2016 జూన్‌లో నమోదైన క్రిమినల్ కేసుపై కింది కోర్టులో జరుగుతున్న విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి రేవంత్‌రెడ్డికి హైకోర్టు మినహాయింపునిచ్చింది.
కింది కోర్టు ఆయనను తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశిస్తే రేవంత్‌రెడ్డి రావాల్సిందేనని స్పష్టంచేసింది. ఈ కేసును సవాల్ చేస్తూ రేవంత్‌రెడ్డి వేసిన పిటిషన్‌పై జస్టిస్ కే లక్ష్మణ్ గురువారం విచారణ చేపట్టి ప్రతివాదులకు నోటీసులు జారీచేశారు. ఈ కేసు తదుపరి విచారణ సెప్టెంబరు 1వ తేదీకి వాయిదా పడింది.