Minister Gangula | మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) కు భారీ ఊరట లభించింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు (telangana high court) కొట్టివేసింది. ఈసీ నిర్ధారించిన వ్యయానికి మించి గంగుల ఖర్చు చేశారని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ (ponnam prabhakar) హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్పై కోర్టు తాజాగా విచారణ జరిపింది. విచారణ సందర్భంగా ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం.. సరైన ఆధారాలు లేవంటూ పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. 2018 ఎన్నికల్లో గంగుల పరిమితికి మించి ఎన్నికల ఖర్చు చేశారని పొన్నం ప్రభాకర్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో పిరమితికి మించి ఖర్చు చేశారని పిటిషన్లో పేర్కొన్నారు.
Also Read..
Varun Raj | అమెరికాలో కత్తిపోట్లకు గురైన ఖమ్మం విద్యార్థి మృతి
Minister KTR | నేటి నుంచి కేటీఆర్ రోడ్ షోలు.. ప్రచార షెడ్యూల్ ఇదీ!