హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): నిర్మల్ టౌన్, కడెం, ముధోల్, లోకేశ్వరం పోలీస్స్టేషన్లలో కొణతం దిలీప్‌పై నమోదైన 5 కేసులపై తదుపరి చర్యలు చేపట్టకుండా హైకోర్టు బుధవారం స్టే విధించింది. దిలీప్ తరఫున సీనియర్ న్యాయవాదులు కే వివేక్‌రెడ్డి, ప్రతీక్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఇది వాక్ స్వాతంత్య్రానికి సంబంధించిన వ్యవహారమని, ఇటువంటి సందర్భాల్లో ముందుగా ప్రాథమిక విచారణ చేయాలని సుప్రీంకోర్టు ఇమ్రాన్ ప్రతాపగఢ్ కేసులో స్పష్టం చేసిందని వివరించారు.
కానీ, ఇకడ అలాంటి విచారణ జరపకుండా ఏకంగా ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని తెలిపారు. అర్నాబ్ గోస్వామి కేసును ఉదాహరణగా చూపుతూ, ఒకే అంశంపై విభిన్న పోలీస్స్టేషన్లలో ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం చట్టవిరుద్ధమ నివాదించారు. హెచ్‌సీయూ ఘటన అంశంతోపాటు పలు వాదనలు పరిశీలించిన హైకోర్టు.. దిలీప్‌పై నమోదైన ఐదు ఎఫ్ఐఆర్లపై తదుపరి చర్యలను చేపట్టకుండా స్టే విధించింది.