Telangana | హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): ఆర్బీఐ నుంచి రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.1000 కోట్ల అప్పు తీసుకున్నది. స్వయంగా ఆర్డీఐ మంగళవారం ఈ విషయాన్ని ప్రకటించింది. దీంతో నిరుడు డిసెంబర్ 7న అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు 315 రోజుల్లో రేవంత్‌రెడ్డి సర్కా రు తెచ్చిన అప్పులు రూ.74,495 కోట్లకు పెరిగాయి.
గత నెలలో 3 దఫాలుగా రూ.4,500 కోట్ల రుణాలు పొందిన రేవంత్ ప్రభుత్వం.. ఈ నెల 1న రూ.2,000 కోట్ల అప్పు తీసుకున్నది. తాజాగా 21 ఏండ్ల కాలానికి బాండ్‌ను జారీచేసి మరో రూ.1,000 కోట్ల అప్పు తెచ్చింది. ఇలా ప్రతి నెలా రూ.5-6 వేల కోట్ల రుణాలు సమీకరిస్తున్న రేవంత్ సర్కారు ఇప్పటివరకు ఒక్క ఆర్బీఐ నుంచే 49,618 కోట్ల అప్పులు తెచ్చింది. ఇవి చాలక కార్పొరేషన్లు, స్వయం ప్రతిపత్తి సంస్థలకు గ్యారంటీలు ఇవ్వడంతో మరో రూ.25 వేల కోట్ల వరకు రుణాలను సేకరించింది.