హైదరాబాద్, ఏప్రిల్2 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది హజ్ యాత్రకు డ్రా పద్ధతిలో 5,278 మం దిని ఎంపికచేసినట్టు రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ మ హ్మద్ సలీం, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ షఫీయుల్లా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన యాత్రికులు హజ్ దరఖాస్తు, డిక్లరేషన్, మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లను, ప్రయాణ రుసుం కింద 81,800 చెల్లించిన బ్యాంక్ రసీదును ఈ నెల 7లోగా అందజేయాలని పేర్కొన్నారు.
జూన్ నెలలో యాత్ర కోసం సిద్ధంగా ఉండాలని, త్వరలో నగరం, జిల్లాల్లో యాత్ర శిక్షణ శిబిరాలను నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 040-23298793 నంబర్లో, www. hajcommittee.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని, లేదా హైదరాబాద్ నాంపల్లిలోని హజ్‌హౌస్‌లో నేరుగా సంప్రదించాలని సూచించారు.