హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): గ్రూప్-4 ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 8,084 మంది అభ్యర్థులతో ప్రొవిజినల్ జాబితాను టీజీపీఎస్సీ గురువారం రాత్రి ప్రకటించింది. పూర్తి వివరాలను అధికారిక వెబ్సైట్లో పెట్టినట్టు కమిషన్ వెల్లడించింది.
అభ్యర్థులు https://www.tspsc.gov.in/ వెబ్సైట్లో ఫలితాలు చూసుకోవచ్చని తెలిపింది. పరీక్షకు 9,51,321 మంది దరఖాస్తు చేసుకోగా, జూలై 1న పరీక్ష నిర్వహించారు. మొత్తం 8,180 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా.. 8,084 ఉద్యోగాలకు మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేసి మరో 96 పోస్టులను పెండింగ్ పెట్టడం గమనార్హం.