చదువు-ఆనందించు-అభివృద్ధి చెందు
పేరుతో ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ
నేటినుంచే అన్ని పాఠశాలల్లో అమలు.. విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ
హైదరాబాద్, ఫిబ్రవరి 4 : విద్యార్థుల చదువులపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. రెండేండ్లు విద్యాసంస్థలు సక్రమంగా తెరుచుకోకపోవడంతో పిల్లల్లో పఠనా సామర్థ్యం దెబ్బతిన్నది. విద్యార్థుల్లో పఠనాసక్తి తిరిగి పెంపొందించేందుకు రాష్ట్ర సర్కారు ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘చదువు-ఆనందించు-అభివృద్ధి చెందు’ పేరుతో పఠనా సామర్థ్యం పెంచేందుకు ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించింది. శనివారం నుంచి అన్ని విద్యాసంస్థల్లో, మాధ్యమాల్లో వీటిని అమలుచేయాలని ఆదేశాలు జారీ చేసింది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే విద్యార్థులు తమ స్థాయికి అనుగుణంగా ధారాళంగా చదివేలా తీర్చిదిద్దాలని సూచించింది. పూర్వ ప్రాథమిక తరగతులతోపాటు 9వ తరగతి వరకు ప్రత్యేక కార్యాచరణను అమలుచేయాలని తెలిపింది.
పాఠశాల విద్య బలోపేతానికే..
పాఠశాల విద్యను బలోపేతం చేసేందుకే ప్రభుత్వం పఠనాభివృద్ధి కార్యక్రమాన్ని తలపెట్టిందని నోడల్ అధికారి సువర్ణ వినాయక్ తెలిపారు. శుక్రవారం చదువు- ఆనందించు- అభివృద్ధి చెందు కార్యక్రమంపై జిల్లా బృందాలకు శిక్షణ ఇచ్చారు. మన ఊరు- మన బడితో పాఠశాలల రూపురేఖలను మార్చేస్తున్న ప్రభుత్వం.. మరో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. ఈ విద్యాసంవత్సరం పూర్తయ్యేనాటికి పిల్లలందరూ ధారాళంగా చదివేలా సిద్ధం చేయాలని సూచించారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు డైరెక్టర్ రమేశ్, తాజ్బాబు పాల్గొన్నారు.
మార్గదర్శకాలివే…