హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది పాఠశాల విద్యాశాఖ బడ్జెట్లో విద్యార్థినులపై ప్రభుత్వం చిన్నచూపు చూసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రూ.17,942 కోట్లు కేటాయించినట్టు ప్రభు త్వం చెప్తున్నా.. ఇందులో రూ.14, 929 కోట్లు వేతనాలకే ఖర్చు చేస్తున్నదని, మిగతా రూ.3001 కోట్లు మాత్రమే ప్రగతి పద్దు కింద కేటాయించిందని గుర్తు చేస్తున్నారు. ప్రగతి పద్దులో విద్యార్థినులకు హైజీనిక్ కిట్ల పథకానికి నిధులు కేటాయించకపోవడంపై విస్మ యం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం ఏడో తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యార్థినులకు హై జీనిక్ కిట్లను అందించిందని గుర్తు చేస్తున్నారు.
దాదాపు 7 లక్షల మంది ప్రయోజనం పొందారని, ఈ ఏడాది నిధులు కేటాయించకపోవడంతో పథకాన్ని మూలకు పడేసినట్టేనని విమర్శిస్తున్నారు. ఇక.. బాలికలు చదివే కస్తూర్బా పాఠశాలలకు ప్రహరీలు నిర్మించడంపైనా విద్యాశాఖ తీవ్ర అలసత్వం ప్రదర్శించిందని చెప్తున్నారు. ర్రూ.1952 కోట్లను సమగ్ర శిక్ష పథకం కింద ఆన్‌గోయింగ్ పనులకు కే టాయించారని, ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు రూ. 500 కోట్లు కేటాయించారని అంటున్నారు. ఇలా రూ.3001 కోట్లలో రూ.2877 కోట్లు ప్రధాన పథకాలకే వెళ్తాయని, మిగతా నిధులనే పాఠశాలల్లో మౌలిక వసతులకు, కొత్త పథకాలకు కేటాయించారని చెప్తున్నారు. ఇవి నామమాత్రమేనని అంటున్నారు.