క్రీడల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యం : మంత్రి శ్రీనివాస్‌గౌడ్
తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు ప్రాధ్యానమిస్తుందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
మహబూబ్‌నగర్ : తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు ప్రాధ్యానమిస్తుందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా క్రీడా స్టేడియం మైదానంలో తన తల్లితండ్రులు విరసనోళ్ల నారాయణ గౌడ్, శాంతమ్మ పేరుతో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను ఆయన ప్రారంభించారు.
మంత్రి మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహిస్తుంచేందుకు గ్రామీణాస్థాయిలో క్రీడా ప్రాంగణాలను నిర్మిస్తున్నాని వెల్లడించారు. జాతీయ అంతర్జాతీయ వేదికలపై పథకాలు సాధించే క్రీడాకారులకు నగదు పురస్కారాలను అందిస్తున్నామని ఆయన వివరించారు. క్రీడల్లో రాణించే క్రీడాకారులకు రెండు శాతం ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పిస్తున్నామని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న విషపూరిత ప్రచారానికి యువత ఆకర్షితులు కాకుండా సరైన మార్గంలో నడవాలని సూచించారు.
క్రమశిక్షణ తో తమ జీవితాల్ని చక్కదిద్దుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లాలో మెగా జాబ్‌మేళాను నిర్వహించి సుమారు 4500 మంది నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలను కల్పించామన్నారు. త్వరలో మరో జాబ్ మేళా నిర్వహించి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, ముడా చైర్మన్ గంజి వెంకన్న ముదిరాజ్, కౌన్సిలర్లు కిషోర్, నిర్వాహకులు నరేశ్, రాజేశ్ ,పవన్, రాజేందర్, గిరి, వీరేశ్, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

