Telangana | హైదరాబాద్ : తెలంగాణలో మరో రెండు కొత్త మండలాలు ఏర్పాటయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలోని సాత్నాల, భోరజ్ మండలాలను ఏర్పాటు చేస్తూ రెవెన్యూ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
జైనథ్ మండలం నుంచి 5 గ్రామాలు, ఆదిలాబాద్ రూరల్ నుంచి రెండు గ్రామాలు, భేల నుంచి మరో 5 గ్రామాలు మొత్తంగా 12 గ్రామాలతో సాత్నాల మండలాన్ని ఏర్పాటు చేసింది. జైనథ్ మండలం నుంచి 28 గ్రామాలను వేరుచేస్తూ భోరజ్ మండలాన్ని ఏర్పాటు చేసింది.