హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): చిన్నారుల రక్షణ, పోషణ విషయంలో తెలంగాణ సర్కా రు దేశానికే ఆదర్శంగా నిలిచింది. అనాథ పిల్లలను అ మ్మలా ఆదరిస్తున్నది. అనాథ పిల్లలకు శాశ్వతంగా భరోసా ఉండే విధాన నిర్ణయం రూపుదిద్దుకుంటున్నది. ‘దేశంలో మరే రాష్ట్రంలో లేని పాలసీని రూపొందించాలి. రాష్ట్రంలో అనాథ బిడ్డలు ఆగం కావద్దు. వారిని ప్రభుత్వ బిడ్డలుగా పరిగణించి సకల వసతులు కల్పించటమే కాకుండా తమ కాళ్ల మీద తాము నిలబడేదాకా వారిని కంటికిరెప్పలా కాపాడుకోవాలి’ అని ఇటీవల మంత్రివర్గ ఉపసంఘానికి సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
మంత్రివర్గ ఉపసంఘం పలుమార్లు సమావేశమై అనాథ చిన్నారులకు అండగా ఉండే నివేదికను రూపొందించారు. ఈ నివేదికను పరిశీలించిన సీఎం కేసీఆర్ మరికొన్ని అంశాల్లో చేర్చాలని సూచించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో మంత్రి సత్యవతి రాథోడ్, సీఎం కార్యదర్శి స్మితాసభర్వాల్, హరితహారం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ కమిషనర్ భారతి హోలీకెరీ, మున్సిపల్ శాఖ డైరెక్టర్ పమేలా సత్పతి తదితరులు శుక్ర, శనివారాలు విశాఖపట్నంలోని ఎస్వోఎస్ ఎన్జీవో నిర్వహిస్తున్న అనాథ ఆశ్రమాన్ని క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తున్నారు. తిరిగి వచ్చాక హైదరాబాద్లోని అదే ఎస్వోఎస్ను మంత్రుల బృందం పరిశీలించి ఇప్పటికే రూపొందించిన అంశాలకుతోడు సీఎం కేసీఆర్ చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకొని తుది సిఫారసులను చేయనున్నది.
అనేక అంశాల్లో మనమే టాప్