రంగారెడ్డి, మార్చి 12(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టబోయే ఫ్యూచర్ సిటీకి బుధవారం ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రెటరీ సంబంధిత జీవో విడుదల చేశారు. రంగరెడ్డి జిల్లాలోని 7 మండలాలు, 36 రెవెన్యూ గ్రామాలను ఫ్యూచర్ సిటీ పరిధిలోకి తీసుకువచ్చారు. రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు, ఇబ్రహీంపట్నం, కడ్తాల్, మహేశ్వరం, మంచాల, యాచారం మండలాల్లోని పలు గ్రామాలను ఫ్యూచర్ సిటీ అథారిటీ ఆధీనంలోనే ఉండనున్నాయి. ఇక నుంచి ఈ గ్రామాల్లో ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో భాగంగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. త్వరలో ఫ్యూచర్ సిటీ అథారిటీకి ప్రత్యేకాధికారిని నియమించడంతో పాటు సిబ్బందిని కూడా కేటాయించడానికి సన్నాహాలు చేస్తున్నారు. కందుకూర్ మండలంలోని గుమ్మడివెల్లి లేదా మీర్ఖాన్పేట్లలో అథారిటీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తున్నది.
ఇబ్రహీంపట్నం మండలం- కప్పాడు, పోచారం, తులేకలాన్, తుర్కగూడ, ఎలిమినేడు కందుకూర్ మండలం-దాసర్లపల్లి, గూ డురు, గుమ్మడివెల్లి, కందుకూరు, లేమూరు, కొత్తూరు, మాదాపురం, మీర్ఖాన్పేట్, ముచ్చర్ల, పంజాగూడ, రాచులూర్, తిమ్మపూర్, సార్లరావులపల్లి మహేశ్వరం- మహబాత్ నగర్, తుమ్మలూరు మంచాల-ఆగపల్లి, నోముల యాచారం-చౌదర్పల్లి, గునగల్, మొగుల్లవంపు, తులేకుర్ధు, యాచారం.