నేటి నుంచి యథావిధిగా వైద్య సేవలు.. జీవో-38 ప్రకారం బదిలీలు చేపడుతాం
తమ డిమాండ్లపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సానుకూలంగా స్పందించడంతో సమ్మెను విరమిస్తున్నట్టు తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రకటించింది. నేటి నుంచి ప్రభుత్వ దవాఖానల్లో యథావిధిగా సేవలు కొనసాగుతాయని స్పష్టంచేసింది.
- టీజీజీడీఏ ప్రతినిధులకు మంత్రి దామోదర హామీ
హైదరాబాద్, జూన్ 5( నమస్తే తెలంగాణ) : తమ డిమాండ్లపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సానుకూలంగా స్పందించడంతో సమ్మెను విరమిస్తున్నట్టు తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రకటించింది. నేటి నుంచి ప్రభుత్వ దవాఖానల్లో యథావిధిగా సేవలు కొనసాగుతాయని స్పష్టంచేసింది. శుక్రవారం బంజారాహిల్స్‌లోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి దామోదరను కలిసిన అసోసియేషన్ ప్రతినిధులు.. బదిలీలు, ఇ తర సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఒ కే స్టేషన్లో నాలుగేండ్ల సర్వీస్ పూర్తిచేసుకున్న వారితోపాటు 3 ఏండ్ల సర్వీస్ ఉన్న ప్రయారిటీ క్యాటగిరీ డాక్టర్లు, జీరో స్పౌజ్ క్యాటగిరీ అభ్యర్థులకు ఆర్డర్ వారీగా బదిలీలు నిర్వహించాల ని విజ్ఞప్తిచేశారు. దీనికి మంత్రి సానుకూలత వ్యక్తం చేసినట్టు నేతలు తెలిపారు. సమస్యల పరిషారానికి మంత్రి హామీ ఇచ్చారని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నరహరి, సెక్రటరీ జనరల్ లాలుప్రసాద్ తెలిపారు.
నిబంధనలు సవరించాలి : టీజీవో డాక్టర్స్ ఫోరం
వైద్య ఆరోగ్యశాఖలో బదిలీల ప్రక్రియలో నిబంధనలను సవరించి అర్హులకు అవకాశం కల్పించాలని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ డా క్టర్స్ ఫోరం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. శుక్రవారం సెక్రటేరియట్ మీడియా పాయిం ట్ వద్ద ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు జనార్దన్ మా ట్లాడారు. ఈ ఏడాది జనవరి 1 నాటికి మూ డేండ్ల సర్వీస్ పూర్తిచేసుకున్న డాక్టర్లు, పారామెడికల్ సిబ్బందికి ఆప్షన్లు ఇచ్చుకునే వెసులుబాటు కల్పించాలని, నాలుగేండ్ల సర్వీస్ నిండి న వారికే పరిమితం చేయొద్దని కోరారు. నా లుగేండ్ల కంటే తకువ సర్వీస్ ఉన్న నాన్ స్పౌ జ్ అభ్యర్థులకు కూడా ఆప్షన్లు ఇచ్చుకునే వెసులుబాటు కల్పించాలని, అప్పుడే అర్హులకు న్యాయం జరుగుతుందని తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసి యేషన్(టీటీజీడీఏ) ప్రభుత్వాన్ని కోరింది. బదిలీ ఆప్షన్ల తర్వాత ఏర్పడే అరైజింగ్ ఖాళీలను కూడా పోర్టల్‌లో ప్రదర్శించాలని సూచించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
Tamilnadu SIR | తమిళనాడులో సర్ షాక్.. పట్టించుకోకపోవడంతో 50 సీట్లు చేజార్చుకున్న స్టాలిన్ సేన!
Elon Musk | ప్రైమ్ మినిస్టర్ అంబానీ.. ఎలాన్ మస్క్ వ్యంగ్యాస్త్రాలు
Manne Krishank | రూ.80 వేల కోట్ల భూమి 10 వేల కోట్లకే.. 818 ఎకరాలను గుట్టుగా తాకట్టు పెట్టిన రేవంత్ సర్కార్: మన్నె క్రిశాంక్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

