హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): మల్లారెడ్డి విశ్వవిద్యాలయ పీఠ్ (సూరారం)కు డీమ్డ్ వర్సిటీ హోదా కల్పిస్తూ కేంద్ర విద్యాశాఖ తాజాగా ఉత్తర్వులిచ్చింది.
మల్లారెడ్డి విద్యాసంస్థలకు చెందిన ఫార్మసీ, మహిళా ఇంజినీరింగ్ కాలేజీ, మెడికల్ సైన్సెస్, మహిళా మెడికల్ కాలేజీ, మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్స్, మల్లారెడ్డి డెంటల్ కాలేజీ, మల్లారెడ్డి నర్సింగ్ కాలేజీలతో కొత్త గా డీమ్డ్ వర్సిటీని ఏర్పాటు చేస్తూ గెజిట్ను జారీచేసింది. ఈ వర్సిటీలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రవేశాలు పొందేందుకు అవకాశముంటుంది.