ఆత్మైస్థెర్యం నింపిన ముఖ్యమంత్రి కేసీఆర్
విధి నిర్వహణలో మరణించిన అటవీశాఖ సిబ్బంది కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన భారీ ఎక్స్గ్రేషియా తమలో ఆత్మైస్థెర్యం, ఆర్థిక భరోసా కల్పించిందని తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రాజా రమణారెడ్డి, తెలంగాణ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ నరేందర్ పేర్కొన్నారు.
- భారీ ఎక్స్గ్రేషియా హర్షణీయం
- తెలంగాణ ఫారెస్ట్ ఆఫీసర్స్ సంఘం
హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): విధి నిర్వహణలో మరణించిన అటవీశాఖ సిబ్బంది కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన భారీ ఎక్స్గ్రేషియా తమలో ఆత్మైస్థెర్యం, ఆర్థిక భరోసా కల్పించిందని తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రాజా రమణారెడ్డి, తెలంగాణ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ నరేందర్ పేర్కొన్నారు. అరణ్యభవన్లో గురువారం అటవీ అధికారుల సంఘాల సమావేశం జరిగింది. అసాంఘిక శక్తుల దాడుల్లో మృతిచెందిన అటవీశాఖ అధికారులు, సిబ్బందికి ప్రభుత్వం ప్రకటించిన భారీ ఎక్స్గ్రేషియా పట్ల సమావేశం హర్షం ప్రకటించింది.
రాజా రమణారెడ్డి, నరేందర్.. సీఎం కేసీఆర్కు, అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఇంత భారీ ఎక్స్గ్రేషియా దేశంలో ఎవరూ చెల్లించలేదని అన్నారు. ప్రభుత్వ నిర్ణయం అధికారుల్లో మనోధైర్యాన్ని నింపిందని చెప్పారు. పోలీసులకే ఈ స్థాయిలో ఎక్స్గ్రేషియా వచ్చేదన్నారు. ఇటీవల గొత్తికోయల దాడిలో చనిపోయిన శ్రీనివాస్ కుటుంబానికి సీఎం కేసీఆర్ భారీ ఎక్స్గ్రేషియా ప్రకటించి అండగా నిలిచారని పేర్కొన్నారు. ప్రభుత్వం రానున్న రోజుల్లో ఫారెస్ట్ ఆఫీస్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నదని, అధికారులకు తుపాకులు కూడా ఇస్తామని హామీ ఇచ్చిందని గుర్తుచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

