KCR | హైదరాబాద్, జూన్ 8(నమస్తే తెలంగాణ): దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం సాయంత్రం జరగనున్న నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఆహ్వానం అందింది. ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో కేంద్ర మాజీమంత్రి ప్రహ్లాద్ జోషి శనివారం కేసీఆర్కు ఫోన్ చేశారు. ఆదివారం రాష్ట్రపతి భవన్లో జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. పలువురు అంతర్జాతీయ ప్రముఖులు, దేశాధినేతలు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు.