Telangana Employees | మే 5న ఒక్కరోజు నిరాహార దీక్ష.. తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ పిలుపు
Telangana Employees | తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో మే 5న తలపెట్టిన ఒక్కరోజు నిరాహారదీక్షలో ప్రతి ఉద్యోగీ పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ పిలుపునిచ్చారు.
Telangana Employees | కొత్తపల్లి, ఏప్రిల్ 28: తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో మే 5న తలపెట్టిన ఒక్కరోజు నిరాహారదీక్షలో ప్రతి ఉద్యోగీ పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ పిలుపునిచ్చారు. మంగళవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో కార్యాలయంలో జేఏసీ భాగస్వామ్య పక్షాలతో అత్యవసర సమావేశం నిర్వహించి మాట్లాడారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను గ్రామస్థాయికి చేరవేయడంతోపాటు వాటిని సమర్ధవంతంగా అమలు చేసేవారు ప్రభుత్వ ఉద్యోగులేనని, అలాంటి ఉద్యోగుల సంక్షేమాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సర్కార్ ఉద్యోగులపై తీవ్ర నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నదని మండిపడ్డారు. ఆరు నెలలకోసారి ఇవ్వాల్సిన డీఎలు, సంవత్సరానికి ఒకసారి ఇవ్వాల్సిన ఇంక్రిమెంట్లు, ఐదేండ్లకు ఒకసారి అమలు చేయాల్సిన పీఆర్సీ వంటి హక్కులను కాలానుగుణంగా అమలుచేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
2023 జూలై ఒకటి నుంచి అమలు కావాల్సిన పీఆర్సీ ఇప్పటికీ జాడలేదని, గత ప్రభుత్వం ఇచ్చిన 5 శాతం ఇంటీరియమ్ రిలీఫ్‌తోనే ఉద్యోగులకు సరిపెట్టడం జరుగుతుందని మండిపడ్డారు. 2024 జూలై నుంచి 2026 జనవరి వరకు రావాల్సిన ఐదు డీఎలను పెండింగ్‌లో ఉంచడం అన్యాయమని వాపోయారు. ఉద్యోగుల జీపీఎఫ్ డబ్బులు, సరెండర్ లీవ్ బిల్లులు, టీజీఎల్ఐఎఫ్ ఇన్సూరెన్స్ బిల్లులు, ఏరియర్స్ సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉండటంతో ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారని చెప్పారు.
ఓపీఎస్ పునురుద్ధరణపై ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని, సీపీఎస్ రద్దుపై ఎలాంటి స్పష్టమైన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. హెల్త్‌కార్డ్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో విఫలమైందని, ఎంపానెల్ట్ హాస్పిటల్స్‌ను ఖరారు చేయకపోవడం వల్ల ఉద్యోగులు వైద్యసేవల విషయంలో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

