10నే ‘చలో హైదరాబాద్’.. సభ రద్దు చేస్తున్నారనే పుకార్లను ఉద్యోగులెవరూ నమ్మొద్దు
ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం తలపెట్టిన ‘చలో హైదరాబాద్' యథాతథంగా నిర్వహిస్తామని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ స్పష్టంచేసింది. లక్ష మంది ఉద్యోగులతో సమరానికి దిగుతామని ప్రకటించింది. చలో హైదరాబాద్ రద్దు, వాయిదా పుకార్లను జేఏసీ కొట్టిపారేసింది.
- సర్కార్ రాతపూర్వక హామీ ఇవ్వనందున ఉద్యమానికే సిద్ధం
- మద్దతు ప్రకటించిన లచ్చిరెడ్డి జేఏసీ
హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం తలపెట్టిన ‘చలో హైదరాబాద్’ యథాతథంగా నిర్వహిస్తామని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ స్పష్టంచేసింది. లక్ష మంది ఉద్యోగులతో సమరానికి దిగుతామని ప్రకటించింది. చలో హైదరాబాద్ రద్దు, వాయిదా పుకార్లను జేఏసీ కొట్టిపారేసింది. సోషల్ మీడియాలో జరుగుతున్న పుకార్లను ఉద్యోగులు నమ్మవద్దని సూచించింది. తాము ఉద్యమం విషయంలో వెనక్కి తగ్గేదిలేదని, ఈ నెల 10న తలపెట్టిన ‘ఉద్యోగుల హక్కుల సాధన సభ’ జరిగి తీరుతుందని స్పష్టంచేశారు. సర్కార్‌తో చర్చల నేపథ్యంలో సోమవారం జేఏసీ నేతలు అత్యవసరంగా సమావేశమై ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. చర్చలు అసంపూర్తిగా ముగియడం, ప్రభుత్వం నుంచి రాతపూర్వక హామీ రాకపోవడంతో ఆందోళనను కొనసాగించాలని నిర్ణయించారు. పీఆర్సీ, డీఏలకు ఇంకా రెండేండ్లు ఆగాలన్న సీఎం వ్యాఖ్యలపై జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికే రెండున్నరేండ్లు గడిచిపోయింది. ఇంకా రెం డేండ్లు ఆగితే ఇచ్చేదేముందని ప్రశ్నించారు.
సభకు లచ్చిరెడ్డి జేఏసీ మద్దతు..
ఉద్యోగుల హక్కుల సాధన సభకు తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ(లచ్చిరెడ్డి) మద్దతు ప్రకటించింది. సోమవారం నాంపల్లిలోని టీఎన్జీవో భవన్లో జేఏసీ నేతలతో భేటీ అయిన లచ్చిరెడ్డి చలో హైదరాబాద్‌కు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ ఆహ్వానం మేరకు మద్దతిచ్చినట్టు జేఏసీ చైర్మన్ వీ లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ వోడ్నాల రాజశేఖర్ ప్రకటించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon | ‘డ్రాగన్’ షూటింగ్‌కి రీఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

