హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : పీఆర్సీ నివేదికను త్వరగా తెప్పించుకుని 40 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించాలని తెలంగాణ ఉద్యోగుల సంఘం (టీఈఏ) ప్రభుత్వాన్ని కోరింది. అసోసియేషన్ అత్యవసర రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని రాష్ట్ర అధ్యక్షురాలు జీ నిర్మల అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు.
పాత పింఛన్‌ను అమలుచేయాలని, పెండింగ్ డీఏలు, బిల్లులు చెల్లించాలని కోరారు. సమావేశంలో సంఘం ప్రతినిధులు చిలగాని సంపత్‌కుమారస్వామి, ఏజే సుగంధిని, జీ రవీందర్‌రెడ్డి, సత్యనారాయణ, మల్లేశ్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.